Thalli Nee Paadaalu Lyrics
ధినకు ధినకు తార ధినకు ధినకుతార
ధినకు ధినకు తార ధీంతారే
ధినకు ధినకు తార ధినకు తార
ధినకు తార ధీంతారే
ధినకు ధినకు తార ధినకు ధినకు తార
ధినకు ధినకు తార ధీంతారే
ధినకు ధినకు తార ధినకు తార
ధినకు తార ధీంతారే
తల్లీ నీ పాదాలు
నా పంచ ప్రాణాలు
నిండూ నూరేళ్లు స ాకే
నీ చల్లని దీవెనలు
తల్లీ నీ పాదాలు
నా పంచ ప్రాణాలు
నిండూ నూరేళ్లు సాకే
నీ చల్లని దీవెనలు
నీ గుండెల్లో పసిపాపల్లె నేనుంటి
నీ దయవల్లే పాటలతో పయనిస్తుంటి
నా జీవితమంతా ఓ
నీ పాదాల చెంత అమ్మా
నా జీవితమంతా ఓ
నీ పాదాల చెంత అమ్మా
తల్లీ నీ పాదాలు
నా పంచ ప్రాణాలు
నిండూ నూరేళ్లు సాకే
నీ చల్లని దీవెనలు
అమ్మా నీ జోల పాటలు
రాగాల తోటనే
ఆ పాటే నా జీవితానికి
పరమార్దం చూపెనే
అమ్మా నీ పిలుపులో
అమృత దారలు ఒలుకునే
అమ్మా నీ చనుబాలు
సర్వ శక్తి సంజీవనే
ప్రకృతికి ప్రతిరూపం అమ్మా
నీ అవతారం
ఈ జగతికి నీవే ఆదారం
అమ్మా అనే పదం
విశ్వానికి ఓ వరం
ఎన్ని చేసినా తీరదు
నీ రుణం
తల్లీ నీ పాదాలు
నా పంచ ప్రాణాలు
నిండూ నూరేళ్లు సాకే
నీ చల్లని దీవెనలు
అమ్మా నువ్వు లాలపొసి
తడిమినది నా దేహము
తల్లీ నీ కాళ్ళు కడుగ
కలిగెను నాకు భాగ్యము
అమ్మా నీ పాద సేవలో
నా జన్మా ఏ దన్యము
ఏడేడు జన్మలు సరిపడ
దొరికెను నాకు పుణ్యము
ఆ నా గుండెలో నీ చిత్రం
నీ ఊపిరి నాకోసం
నేనేసే ప్రతి అడుగు నీదే
నీవేలే నా సర్వం
నేనేలే నీ ప్రాణం
నీతోడే నా నీడై వచ్చే
తల్లీ నీ పాదాలు
నా పంచ ప్రాణాలు
నిండూ నూరేళ్లు సాకే
నీ చల్లని దీవెనలు
Writer(s): Matla Thirupathi
Lyrics powered by www.musixmatch.com
More from Thalli Nee Paadaalu
Loading
You Might Like
Loading
4m 18s · Telugu