Adham Lo Ammayi (feat. Deepu) Lyrics
తన కన్నులు చురకత్తుల్లా
గుండెను కోస్తుంటాయి
తన నవ్వులు ఆ గాయాలకు
మందును పూస్తుంటాయి
అరచేతికి అందే జాబిలి అనిపిస్తుంటుంది
తాకాలనిపించే తలపును రగిలిస్తుంటుంది
తానెవ్వరు అంటే.
అద్దంలో చూస్తే తను ఓ అమ్మాయి
నిద్దరకే తెలిసే రంగుల నడిరేయి
పైకెత్తని ఆ రెప్పలు నిను
సూటిగ చూస్తుంటాయి
మునుపెన్నడు చూడని కలలను
చూద్దువు రమ్మంటాయి
వనికే ఆ పెదవులు ఏవో కబురులు చెబుతుంటాయి
విన్నాననుకున్నవి అన్నీ నిజమని నమ్మిస్తాయి
ఇటు రానని ఆమని అంచున నిలిచే ఉంటుంది
కాలానికి ఎదురీదేలా కవ్విస్తుంటుంది
తానెవ్వరు అంటే.
అద్దంలో చూస్తే తను ఓ అమ్మాయి
నిద్దరకే తెలిసే రంగుల నడిరేయి
చీకటి రంగుల నడిరేయి
అద్దంలో చూస్తే తను ఓ అమ్మాయి
నిద్దరకే తెలిసే రంగుల నడిరేయి
నీలోని గొప్పతనం అంతెత్తున చూపిస్తుంది
నీకే నువు కనబడనంతటి లోతుల్లో తోస్తుంది
నీ స్నేహం తన ప్రాణం అని నీపై ఒట్టేస్తుంది
ఆ ప్రాణం తన గుప్పిట్ లో పట్టుకు వెళ్లిపోతుంది
ఇస్తుందో లాక్కుంటోందో ఏమో ఆ చేయి
చేజారేదాకా అర్థం కానివ్వని హాయి
తానెవ్వరు అంటే.
అద్దంలో చూస్తే తను ఓ అమ్మాయి
నిద్దరకే తెలిసే రంగుల నడిరేయి
అద్దంలో చూస్తే తను ఓ అమ్మాయి
నిద్దరకే తెలిసే రంగుల నడిరేయి
Lyrics powered by www.musixmatch.com
More from Anaamika
Loading
You Might Like
Loading
3m 49s · English